: భార్య కోసం మొత్తం థియేటర్ నే బుక్ చేశాడు!


బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఈ అభిమాని గురించి మాత్రం తప్పకుండా ప్రస్తావించాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ ప్రాంతానికి చెందిన శంకర్ మసాఫిర్, గీతాంజలి భార్యా భర్తలు. తన భార్యకు హీరో సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన అభిమానం. దీంతో, సల్మాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రాన్ని తన భార్యకు చూపించాలనుకున్నాడు. అయితే, ప్రేక్షకుల మధ్యలో కూర్చుని కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాను ఆమెకు చూపించి ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అంతే, థియేటర్ మొత్తం బుక్ చేసి భార్యకు సినిమా చూపించాడు. ఇక భార్యామణి ఆనందానికి అవధులు లేవు!

  • Loading...

More Telugu News