: వింబుల్డన్ లో సాన్ టీనా జోడీ ఓటమి
వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సాన్ టీనా జోడీ ఓటమిపాలైంది. రోలాండ్ గారోస్ స్టేడియంలోని కోర్టు వన్ లో జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా (భారత్), మార్టీనా హింగీస్ (స్విట్జర్లాండ్) జోడీపై టి. బబోస్ (హంగేరీ), వై.షెవెదోవా (కజికిస్థాన్) జోడీ 6-2, 6-4 తేడాతో తిరుగులేని విజయం సాధించి, సెమీఫైనల్ లో అడుగుపెట్టారు. దీంతో అప్రతిహత విజయాలతో మంచి జోరుమీదున్న సాన్ టీనా జోడీ వింబుల్డన్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది.