: ఈనెల 9న తెలంగాణ ఎంసెట్-2.. అన్ని ఏర్పాట్లు పూర్తి


తెలంగాణ‌లో ఈనెల 9 వ తేదీన ఎంసెట్‌-2 ను నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్షను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు ఈరోజు మీడియాకు తెలిపారు. ఈ పరీక్షకు 56,188 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయ‌న‌ తెలిపారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 95 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రాథ‌మిక కీని ఈనెల 9వ తేదీ సాయంకాలం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈనెల‌ 14న ర్యాంకులు ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News