: ‘సుల్తాన్’ అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది: హీరో అమీర్ ఖాన్


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రం అద్భుతంగా ఉందని, ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని మరో అగ్రహీరో అమీర్ ఖాన్ అన్నాడు. ఈమేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన ట్వీట్లు చేశారు. గత రాత్రి ఈ చిత్రాన్ని చూశానని, దర్శకుడు అలీ అబ్బాస్ దర్శకుడిగా, రచయితగా తన సత్తా చాటారని అన్నాడు. సల్మాన్, అనుష్క లు అద్భుతంగా నటించారని అమీర్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News