: ఆ ఘటనకు కారణం వైద్యుల నిర్లక్ష్యమే: ప్రాథమిక నివేదికలో వెల్లడి


హైదరాబాదులోని సరోజనీ ఆసుపత్రిలో చోటుచేసుకున్న కంటి ఆపరేషన్ల వైఫల్యంపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ నెల 30న ఆపరేషన్లు నిర్వహించగా, 13 మందికి కంటిచూపు పోయింది. ఈ ఆపరేషన్లలో డాక్టర్ నిర్లక్ష్య వైఖరిపై ఆసుపత్రికి సమాచారం ఉన్నప్పటికీ, దానిని దాచేందుకు ప్రయత్నించారని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. సెలైన్ వల్లే వారికి ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు చెబుతున్న కారణం సరికాదని నివేదికలో అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టమవుతోందని ఈ నివేదిక తేటతెల్లం చేసింది.

  • Loading...

More Telugu News