: హరితహారం అమలు చేసే విధానంలో అవినీతి: భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన రెండో విడత హరితహారం కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పచ్చని మొక్కలను నాటే కార్యక్రమం మంచిదేనని ఆయన అన్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానంలో అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా, మల్లన్న సాగర్ భూనిర్వాసితుల అంశంపై కేసీఆర్ ప్రభుత్వ తీరుని భట్టివిక్రమార్క తప్పుబట్టారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశలో తాము ఉన్నామని ఆయన పేర్కొన్నారు.