: అభిమానులకు ఈద్ ముబారక్ చెప్పిన షారూక్ ఖాన్... ఇదిగో వీడియో !
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన అభిమానులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. ముంబయిలోని తన నివాసం ‘మన్నత్’ వద్దకు వచ్చిన అభిమానులకు షారూక్ ఈద్ ముబారక్ చెప్పారు. తన చిన్న కొడుకు అబ్ రామ్ ను ఎత్తుకుని బాల్కనీలోకి వచ్చిన షారూక్ చేతులూపుతూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అబ్ రామ్ కూడా తండ్రిని అనుకరించడంతో అభిమానులు మరింత సంతోషపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో పలు న్యూస్ ఛానెళ్లలో హల్ చల్ చేస్తోంది.