: నవ్వుతూ జీతం తీసుకోవడం కంటే మంచి ఉద్యోగమేముంటుంది చెప్పండి?: షోయబ్ అఖ్తర్


నవ్వుతూ జీతం తీసుకోవడాన్ని మించిన ఉద్యోగం ఏముంటుందని పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యాతగా స్థిరపడ్డాడు. తాజాగా భారత్ లోని ఓ టెలివిజన్ చానెల్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఛానెల్ లో ప్రసారం కానున్న కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించనున్నాడు. దీనిపై షోయబ్ తన సోషల్ ఖాతాలో పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే జోక్స్ ను ఆస్వాదించడం మధురానుభూతిగా నిలవనుందని అన్నాడు. ఇండియన్ మజాక్ లీగ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నానని, కామెడీని ఆస్వాదిస్తూనే జీతం తీసుకోవడాన్ని మించిన ఉద్యోగమేముంటుందని షోయబ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News