: ధోనీ ఫ్లూట్ వాయిస్తుంటే వీడియో తీసిన రైనా!


కీపింగ్ చేయడమే కాదు ఫ్లూట్ వాయించడమూ టీమిండియా కెప్టెన్ ధోనీకి తెలుసని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా చెప్పాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రైనా చెప్పాడు. ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఈరోజు ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన రైనా, ధోనీ ఫ్లూట్ వాయిస్తున్న ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఒక విమానాశ్రయంలో ధోనీ ఫ్లూట్ వాయిస్తూ సేద తీరుతుండగా రైనా వీడియో తీశాడు. అయితే, ఏ పర్యటనలో ఉండగా ధోనీ ఫ్లూట్ వాయించాడనే వివరాలను రైనా వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News