: త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానానికి తప్పిన పెను ముప్పు


నేపాల్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ముప్పు తప్పింది. ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 మంది ప్రయాణికులతో హాంగ్ కాంగ్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికి దానిని ఓ పక్షి ఢీ కొట్టింది. దీంతో విమానం ఇంజిన్ బాగా దెబ్బతింది. దీనిని గుర్తించిన పైలట్ సకాలంలో స్పందించి, విమానాన్ని వెనక్కి తిప్పాడు. తిరిగి అదే విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వేరే విమానంలో వారిని హాంగ్ కాంగ్ పంపినట్టు అధికారులు తెలిపారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ బాగా దెబ్బతిందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News