: పులసల తాకిడి మొదలు... కేజీన్నర పులస రూ.3,000
గోదావరికి వరదనీరు వచ్చి పడుతుండడంతో పులస చేపల తాకిడి మొదలైంది. వశిష్ట నదిలో ఈ సీజన్ లో తొలిసారిగా పెదలంక మత్స్యకారుల వలకు పులస చేప చిక్కింది. కాకినాడలోని మలికిపురం మార్కెట్ లో దీనిని అమ్మకానికి పెట్టారు. సుమారు కేజీన్నర బరువున్న పులస ధర రూ.3 వేలకు నిన్న అమ్ముడైంది.