: మొజాంబిక్‌తో కీలక ఒప్పందాలు చేసుకున్న భారత్
భారత ప్రధాని నరేంద్రమోదీ నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మొజాంబిక్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫిలిపే న్యూసీతో మోదీ భేటీ అయ్యారు. ఆ దేశంతో సాంస్కృతిక బంధం బలోపేతం, ఇతర అంశాలపై చర్చించి పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. పప్పుల దిగుమతిపై మొజాంబిక్-భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆహార భద్రత అంశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆఫ్రికాలో భారత్ పెట్టుబడులకు మొజాంబిక్ ముఖద్వారంలా ఉందని అన్నారు. భారత్.. మొజాంబిక్‌కి నమ్మకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. దేశ అర్థిక సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంపై కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.