: వచ్చే రెండున్నరేళ్లలో మా సత్తా చాటుతాం: జైపాల్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధి విధానాలపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని, 2013 భూసేకరణ చట్టం అమలు పరచకపోతే ఆందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా వారి స్వంత ప్రయోజనాల కోసమే ఇతర పార్టీలో చేరారని, వారు అవకాశవాదులని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ మళ్లీ పుంజుకుంటోందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే రెండున్నరేళ్లలో తాము సత్తా చాటుతామని ఆయన చెప్పారు.