: విండీస్ పర్యటన మొదలైంది: కుంబ్లే
కరేబియన్ పర్యటనకు బయలుదేరిన టీమిండియా ఈరోజు ఆ గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. వెస్టిండీస్‌లో విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లతో తాను దిగిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. తాము సెయింట్ కీట్స్ చేరుకున్నామని ఆయన తెలిపారు. ‘లాంగ్ ఫ్లైట్.. పర్యటన మొదలయింది’ అని ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం తమ దేశంలో భారత్ క్రికెట్ టీమ్ అడుగుపెట్టిన సందర్భంగా టీమిండియా ఆటగాళ్ల ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది. 15 మంది టీమిండియా ఆటగాళ్లతో పాటు కుంబ్లే కూడా ఈ ఫోటోలో ఉన్నారు. టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో రెండు వార్మప్ మ్యాచ్‌లతో పాటు 4 టెస్టులను ఆడనుంది. వార్మప్ మ్యాచ్‌ల అనంతరం జులై 21 నుంచి టెస్టు మ్యాచులు ప్రారంభం అవుతాయి.