: తొలిరోజు కలెక్షన్ల రికార్డును మిస్సయిన 'సుల్తాన్'... 'తొలి వారం' మాత్రం గ్యారంటీయేనట!
సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'సుల్తాన్' తొలి రోజు కలెక్షన్ల రికార్డును తృటిలో కోల్పోయింది. సల్మాన్ నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తొలి రోజున రూ. 40 కోట్లు వసూలు చేసి రికార్డులు రాయగా, సుల్తాన్, రూ. 37 నుంచి రూ. 38 కోట్లకే పరిమితమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రంజాన్ పర్వదినం ముందనుకున్నట్టుగా 6వ తేదీన రాకపోవడం కలెక్షన్లు స్వల్పంగా తగ్గడానికి కారణమని అంచనా వేస్తున్నారు. అయితే, రంజాన్, ఆపై వారాంతాల్లో ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసి, తొలి వారం కలెక్షన్లలో కొత్త రికార్డులను సృష్టించవచ్చని భావిస్తున్నారు. సుల్తాన్ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ హిట్టయినట్టేనని పలు రివ్యూలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో సల్మాన్ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకునేలా కనిపిస్తున్నాడు.