: చంద్రబాబుని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు: గాలి ముద్దుకృష్ణమ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం తన కనుసన్నలలోనే జరిగిందని కేసీఆర్ అంటారని చెప్పారు. మరి కేసీఆర్ హైకోర్టు విభజన గురించి ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే స్థలం చూపించిందని ఆయన చెప్పారు. హైకోర్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎంను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని ముద్దుకృష్ణమ అన్నారు. ప్రాజెక్టులు, సంస్థల విభజన అంశాల్లో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడిని దేశంలో ఐటీకి అంబాసిడర్‌గా ముద్దుకృష్ణమ అభివర్ణించారు.