: తగిన శిక్ష... శునక హింసకులకు వైద్య విద్యను దూరం చేసిన కాలేజ్


కనీస మానవత్వాన్ని చూపకుండా, అత్యంత హేయంగా ఓ కుక్కను మూడంతస్తుల భవంతిపై నుంచి విసిరేసి పైశాచికానందాన్ని పొందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్టు వారు చదువుకుంటున్న కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఇద్దరినీ కాలేజీ నుంచి పంపించి వేస్తున్నట్టు తెలియజేసింది. ఈ ఘటనలో గౌతమ్ సుదర్శన్ శునకాన్ని విసిరివేయగా, ఆయన స్నేహితుడు ఆశిష్ పాల్ దాన్ని వీడియో తీసిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న వీరిని వైద్య విద్యకు దూరం చేయడం ద్వారా తగిన శిక్ష విధించినట్లయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ముందు, వెనుక కాళ్ల ఎముకలు విరిగిన శునకం, ప్రస్తుతం ఓ వెటర్నరీ ఆసుపత్రిలో కోలుకుంటోంది. అన్నట్టు దానికిప్పుడు 'భద్ర' అని పేరు పెట్టారు కూడా.

  • Loading...

More Telugu News