: జలీల్ ఖాన్ సంచలన ప్రకటన!... మరో 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంపేనట!
వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ నేటి ఉదయం మరో సంచలన ప్రకటన చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు కాకుండా మరో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు. త్వరలోనే సదరు 15 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించిన జలీల్ ఖాన్... మైనారిటీల సంక్షేమానికి టీడీపీ మాత్రమే కృషి చేస్తోందని అన్నారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.