: తన ఇంటికొచ్చిన గవర్నర్ కు కుమారుడిని పరిచయం చేసిన చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం నిమిత్తం నిన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజయవాడకు వెళ్లారు. తనతో చర్చలు జరపడానికి వచ్చిన గవర్నర్ ను కలిసేందుకు చంద్రబాబు కూడా నరసింహన్ బస చేసిన హోటల్ కు వెళ్లారు. ఆ తర్వాత గవర్నర్ ను తన కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పసందైన విందు ఇచ్చిన చంద్రబాబు పనిలో పనిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న తన కుమారుడు నారా లోకేశ్ ను నరసింహన్ కు పరిచయం చేశారట.