: 2018 జాతీయ క్రీడలు అమరావతిలో ఉంటాయంటున్న మంత్రి అచ్చెన్నాయుడు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అత్యాధునిక క్రీడా గ్రామాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఇప్పటికే సీఎంతో మాట్లాడామని, స్థలం నిర్ణయించి స్టేడియాల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. 2018 సంవత్సరంలో జాతీయ క్రీడలను ఇక్కడే నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆరు ఇండోర్ స్టేడియాలు, ఓ భారీ ఓపెన్ ఎయిర్ స్టేడియం నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 స్టేడియాలను వివిధ ప్రాంతాల్లో నిర్మించాలని భావిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News