: ఎన్నికలంటే టీడీపీ భయపడుతోంది: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా
ఎన్నికలంటే తెలుగు దేశం పార్టీ నేతలు భయపడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఈరోజు విశాఖ పట్నంలో పర్యటిస్తోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. అందుకే జీవీఎంసీ ఎన్నికలను తాత్సారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే క్రమంలో తాము వెనకడుగు వేయబోమని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడానికి తాము పోరాడుతూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. విశాఖకు రైల్వే జోన్ తీసుకురావడానికి ఉద్యమిస్తూనే ఉంటామని తెలిపారు.