: రంజాన్ సందర్భంగా జంటనగరాల్లో 10 వేల మందితో భద్రత: హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జంటనగరాల్లో 10 వేల మందితో భద్రతను ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. మసీదుల వద్ద ప్రత్యేక బలగాలు, సీసీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని అయన పేర్కొన్నారు. నిఘా నేత్రాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులని గమనిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు నేటి నుంచి నెలరోజుల వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.