: నేను నాన్ ప్లేయింగ్ కెప్టెన్... చంద్రబాబు ప్లేయింగ్ కెప్టెన్: గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పరిశీలన సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంపై సీఎం నారా చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన గవర్నర్... తాను ఒక్క తెలంగాణకే పరిమితమయ్యానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకూ అమరావతిలో కొంత స్థలమివ్వమని చంద్రబాబును కోరానని ఆయన చెప్పారు. అయినా తాను ప్రస్తుతం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా మాత్రమే ఉన్నానని చెప్పిన ఆయన చంద్రబాబును మాత్రం ప్లేయింగ్ కెప్టెన్ గా అభివర్ణించారు.

  • Loading...

More Telugu News