: సచివాలయ నిర్మాణంలో గవర్నర్ విలువైన సూచనలు ఇస్తున్నారు: చంద్రబాబు
గవర్నర్ నరసింహన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతిలో సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అక్కడి పనులను గురించి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నరసింహన్ మొదటిసారి ఇక్కడకు వచ్చారని, ఆయనకు రాజధాని పనుల గురించి వివరించానని అన్నారు. గవర్నర్ సచివాలయ నిర్మాణంలో విలువైన సూచనలిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘ఇక్కడి నుంచి పాలన ఎలా నిర్వహిస్తామో, విషయాలన్నీ చెప్పా’ అని ఆయన అన్నారు. ‘ప్రతీ బ్లాక్ గురించి వివరించా. ఏయే బ్లాక్‌లో ఏయే కార్యాలయాలు ఉండబోతున్నాయో చెప్పా’ నని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పాలనకోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అన్ని సమస్యలను అధిగమిస్తున్నామని చెప్పారు.