: మరోసారి వణికిన బంగ్లాదేశ్... రంజాన్ ప్రార్థనలు జరిగే ప్రాంతంలో పేలుడు


బంగ్లాదేశ్ లో మరో ఉగ్రదాడి జరిగింది. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రాంతంలో ఉగ్రవాదులు శక్తిమంతమైన బాంబులు పేల్చారు. కిషోర్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించగా, ఒక పోలీసు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. దాడిలో పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.

  • Loading...

More Telugu News