: బస్సు ప్రయాణికుల నుంచి 'సేఫ్టీ' సెస్ వసూలు చేయనున్న చంద్రబాబు సర్కారు


ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహించే అన్ని బస్సుల్లో ప్రయాణికుల నుంచి 'సేఫ్టీ' సెస్ పేరిట టికెట్ చార్జీపై అదనంగా ఒక రూపాయిని వసూలు చేయనున్నారు. ప్రస్తుతం నిత్యమూ సరాసరిన 60 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తుండగా, వీరి నుంచి రోజూ వసూలు చేసే రూ. 60 లక్షలతో బీమా కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. ఆపై దురదృష్టకర ఘటనలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతే, ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారాన్ని బీమా సంస్థ ఇస్తుంది. పల్లె వెలుగు నుంచి అమరావతి వరకూ అన్ని రకాల బస్సులకూ ఇదే వర్తిస్తుంది. ప్రమాదాల్లో సంవత్సరానికి 80 మంది వరకూ మరణిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతుండటంతో, ఆర్టీసీపై పరిహార భారం పడకుండా ఈ కొత్త సెస్ ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News