: 'బర్త్ డే' పేరిట వేటు తప్పించుకున్న ఆరో కేంద్ర మంత్రి... అయినా రెండు రోజుల ముచ్చటే!


రెండు రోజుల క్రితం మొత్తం 19 మందిని తన క్యాబినెట్ లోకి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అదే రోజు సాయంత్రం ఐదుగురు మంత్రులను పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మోదీ తొలగించిన కేంద్ర మంత్రుల సంఖ్య 6. మోదీ వేటేయాలని నిర్ణయించుకున్న ఆరవ మంత్రి కర్ణాటకకు చెందిన జీఎం సిద్దేశ్వర. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం స్వయంగా సిద్దేశ్వరకు వెల్లడించి రాజీనామా చేయాలని కోరగా, 5వ తేదీ మంగళవారం తన జన్మదినోత్సవమని, ఆ రోజు తన సొంత నియోజకవర్గం దావణగెరెలో ప్రజలు భారీ ర్యాలీ, ఉత్సవాలు జరుపుతున్నారని, ఈ ఒక్క రోజూ తనను తొలగిస్తున్నారన్న వార్తను వెలువడనీయవద్దని వేడుకున్నట్టు తెలుస్తోంది. ఆయన కోరిక మేరకే మంగళవారం నాటి రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన కేంద్ర మంత్రుల జాబితాలో సిద్దేశ్వర పేరు మిగిలే ఉంది. ఇక నేడు ఢిల్లీ వెళ్లి పార్టీ నేతలతో చర్చల అనంతరం సిద్దేశ్వర తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్టు తెలుస్తోంది. మోదీ ఇప్పటికే సన్వర్ లాల్ జాట్, నిహాల్ చంద్, రాం శంకర్ కఠారియా, మున్సుల్ భాయ్ వాస్వా, మోహన్ భాయ్ కుందారియాలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 78గా ఉన్న కేంద్ర మంత్రుల సంఖ్య సిద్దేశ్వర రాజీనామా తరువాత 77కు తగ్గుతుంది.

  • Loading...

More Telugu News