: మోదీ ఆదేశాలతో కార్యరంగంలోకి కొత్త మంత్రులు!... కేటాయించిన శాఖల బాధ్యతల స్వీకరణ పూర్తి!


‘సన్మానాలొద్దు... పని మొదలెట్టండి’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు బాగానే పనిచేసినట్లున్నాయి. మొన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, పలువురు కీలక మంత్రుల శాఖలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో తక్షణమే కార్యరంగంలోకి దిగిపోవాలంటూ మోదీ జారీ చేసిన ఆదేశాలను మంత్రులంతా తుచ తప్పకుండా పాటించారు. కొత్తగా చేరిన మంత్రులంతా నిన్ననే తమకు కేటాయించిన శాఖల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక శాఖలు మారిన మంత్రుల్లో జవదేకర్ మినహా మిగిలిన వారు తమ కొత్త శాఖల కార్యాలయాలకు వెళ్లి మరీ కొత్త బాధ్యతలను తీసుకున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలో మొత్తం కొత్త మంత్రులంతా బాధ్యతలు స్వీకరించడం గమనార్హమే.

  • Loading...

More Telugu News