: తాత్కాలిక సచివాలయానికి గవర్నర్!... చంద్రబాబుతో కలిసి పనులను పరిశీలించనున్న నరసింహన్!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడికి వెళ్లనున్నారు. ఇటీవలే అక్కడ ప్రారంభమైన తాత్కాలిక సచివాలయాన్ని ఆయన పరిశీలిస్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం నిన్న రాత్రికే విజయవాడకు చేరుకున్న నరసింహన్... నిన్న రాత్రి అక్కడే బస చేశారు. మరికాసేపట్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ఆయన ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి వెలగపూడికి వెళతారు. అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులు, ఇప్పటికే ప్రారంభమైన కొన్ని కార్యాలయాలను ఆయన పరిశీలించనున్నారు.