: పగలు పెరిగితే.. ఎలుకలకు దిగులు జాస్తి


సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌ అంటూ ఒకటి ఉంటుంది. చలికాలం, ముసురు పట్టి ఉండే కాలం.. లాంటి సీజన్లలో మనుషులు మూడీగా ఉండడం, మానసికంగా కుంగిపోవడం అనేది ఈ వ్యాధి లక్షణం. శీతాకాలం ఎక్కువగాఉండే, చలి దేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీన్నే వింటర్‌బ్లూస్‌ అని కూడా అంటారు. వెలుతురు తక్కువ రోజుల్లో, నిర్లిప్తంగా ఉండడం మనుషుల్లో లక్షణం అయితే... ఎలుకల్లో ఇందుకు పూర్తి రివర్సుగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

పగలు సమయానికి ఎలుకల్లో ప్రవర్తనకు లింకుంటుంది. మనుషులకు భిన్నంగా.. ఎక్కువ పగలు ఉండే రోజుల్లో ఎలుకలు మానసికంగా కుంగిపోతాయట. వెలుగు తక్కువగా ఉన్నప్పుడు వాటి మెదడుల్లో డోపమైన్‌ కణాలుఉత్పత్తి అయి.. వాటిని మరింత చురుగ్గా మారుస్తుందిట. వెలుతురు విషయంలో క్షీరదాల స్పందన ఒకే తీరుగా ఉంటుందని భావించిన శాస్త్రవేత్తలకు ఎలుకల్లో ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది.

మనుషుల్లో అయితే డోపమైన్‌ ఉత్పత్తి చేసే కణాలు మృతిచెందితే గనుక.. పార్కిన్సన్స్‌ వ్యాధి సోకుతుంది. ప్రస్తుత ఆవిష్కరణలు.. ఈ వ్యాధి చికిత్స పద్ధతుల్లో కొత్త విధానాల రూపకల్పనకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News