: 20 నిమిషాలు సాగిన సమావేశం... విందుకు చంద్రబాబు నివాసానికెళ్లిన గవర్నర్
విజయవాడలోని గేట్ వే హోటల్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. సాయంకాలం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ కు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపీ రాముడు స్వాగతం పలికారు. అనంతరం గేట్ వే హోటల్ కి గవర్నర్ చేరుకున్నారు. అనంతరం హోటల్ లో గవర్నర్ బసకు వెళ్లిన చంద్రబాబు సుమారు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రాజుకున్న హైకోర్టు విభజన, నదీ జలాల పంపకాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి విందుకు తీసుకెళ్లారు.