: ఎట్టెట్టా?...టెండర్లు రాకపోతే...తక్కువ ధరకు వచ్చిన బిడ్ కే కట్టబెడతారా?: 'సదావర్తి భూముల'పై సీపీఐ నారాయణ


తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటనతో సదావర్తి భూములను సందర్శించిన సీపీఐ నేత నారాయణ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో బిడ్లు రాని పక్షంలో ఆ టెండర్లను రద్దు చేసి, మరోసారి ధరను సమీక్షించి టెండర్లు పిలుస్తారని, ఈ విధానం అన్ని రంగాలకు వర్తిస్తుందని, అయితే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం మాత్రం ఓ లోకల్ పేపర్ లో సదావర్తి సత్రం వేలానికి సంబంధించిన టెండర్ ప్రకటన ఇచ్చిందని ఆరోపించారు. అంతటితో ఆగని ప్రభుత్వం... ఆ టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన వ్యక్తికి కట్టబెట్టేశారని నారాయణ మండిపడ్డారు. ఈ టెండర్లలో పాల్గొన్న చెన్నైకి చెందిన రియల్టర్ మాట్లాడుతూ, టెండర్ల సంగతి తెలుసుకుని వేలానికి హాజరైతే అధికారులే సంబంధంలేని ప్రశ్నలు, సమాధానాలతో తనను తిప్పి పంపేశారని ఆరోపించారు. దీంతో దీని వెనుక ఏదో మతలబు ఉందని భావించి, తాను టెండర్లకు దూరంగా ఉన్నానని, ఈ టెండర్లు కూడా మూడు పేర్లతో ఒకరే వేయడం విశేషమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News