: కదిలాయ్ కదిలాయ్...జగన్నాథ్ రథ చక్రాలు కదిలాయ్...!
జగన్నాథ రథచక్రాలు కదిలాయి. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీలో జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం జగన్నాథుడు కొలువైన రథాన్ని లాగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జగన్నాథుడికి పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా అంగరంగవైభవంగా జరిగే జగన్నాథ రధయాత్రను నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలయాధికారులు చర్యలు తీసుకున్నారు.