: హైదరాబాదులో హై అలెర్ట్... పండగల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం!
హైదరాబాదులో భద్రతాధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ఒకవైపు రంజాన్ వేడుకలు, మరోవైపు బోనాల జాతర రావడంతో హైదరాబాదుతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం పండగ శోభను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి కీలక సమాచారం తెలుసుకున్న పోలీసులు, అనంతపురంలో వారు బస చేసిన లాడ్జిలోంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పండగ సమయాన్ని అవకాశంగా తీసుకుని, ఉగ్రవాదులు పేట్రేగే అవకాశం ఉందని భావించిన పోలీస్ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. దర్గాలు, మసీదులు, దేవాలయాల వద్ద భద్రతను పెంచారు. కీలక ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించడంతో పాటు పెట్రోలింగ్ ను పెంచారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.