: పాక్ ప్రధాని షరీఫ్ కు ఫోన్ చేసిన పీఎం మోదీ
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ తరపున పాకిస్తాన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. కాగా, పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకునే నరేంద్ర మోదీ గతంలో లాహోర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉంటామని మోదీ పలు సార్లు స్పష్టం చేయడం విదితమే.