: దత్తత గ్రామంలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్


కరీంనగర్ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామమయిన ముస్తాబాద్‌ మండలం చీకోడులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈరోజు పర్యటించారు. అక్కడి వీధుల్లో కలియ తిరుగుతూ ప్రజల కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించి కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కి గ్రామ‌ప్ర‌జ‌లు ప‌లు విన్న‌తులు చేసుకున్నారు. గ్రామ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుతాన‌ని కేటీఆర్ చెప్పారు. ఆ గ్రామంలోని పాఠ‌శాల‌లో ఆయ‌న మొక్క‌లు నాటారు. అనంత‌రం వెంకట్రాపల్లిలోనూ ఆయ‌న మొక్క‌లు నాటారు.

  • Loading...

More Telugu News