: గర్ల్ ఫ్రెండ్ హత్య కేసులో బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ కు ఆరేళ్ల జైలు శిక్ష!
పారా ఒలింపియన్, బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ కు దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా న్యాయస్థానం ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 14న తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్ క్యాంప్ ను ఆస్కార్ పిస్టోరియస్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. తన బెడ్ రూం టాయిలెట్ నుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి చంపేశాడు. అనంతరం విచారణ సందర్భంగా ఆమెను దొంగగా భావించి కాల్చి చంపానని వాంగ్మూలమిచ్చాడు. అనంతరం అరెస్టైన పిస్టోరియస్ ఏడాది జైలు శిక్ష తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. న్యాయమూర్తి ఈ కేసులో తాజాగా తుదితీర్పును వెలువరిస్తూ, 'ఆస్కార్ పిస్టోరియస్ దిగజారిపోయిన హీరో' అని వ్యాఖ్యానించారు. అతనికి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఆస్కార్ పిస్టోరియస్ మిగిలిన ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించనున్నాడు.