: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.. వైఎస్సార్సీపీ అధినేత జగన్
రేపు రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం మానవాళికి స్ఫూర్తి అని, పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం ముస్లింల ప్రార్థనలలో కనిపిస్తుందని, వారు సుఖ శాంతులతో ఉండాలని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలందరికీ ఈ సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జగన్ ఒక ప్రకటనలో తెలిపారు.