: అనంతపురంలో ఐఎస్ఐఎస్ కీలక పత్రాలు లభ్యం?
అనంతపురం పట్టణంలో ఐఎస్ఐఎస్ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో పట్టుబడిన ఉగ్రవాదులు అనంతపురంలో సంచరించినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. వారిచ్చిన సమాచారంతో అనంతపురం వెళ్లిన ఎన్ఐఏ అధికారులు గతంలో ఉగ్రవాదులు బస చేసిన హోటల్ నంది రెసిడెన్సీకి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అక్కడున్న ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్ లు, లాగిన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం సేకరించారు. కాగా, ఉగ్రవాదులు తుపాకీ కొనుగోలు చేసేందుకు అనంతపురం వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో అనంతపురంలో ఆయుధాలు సరఫరా చేసేవారికి ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయా? అన్న దిశగా దర్యాప్తు ప్రారంభమైంది.