: అక్కడ దెయ్యం ఉయ్యాల ఊగిందట... వీడియో వైరల్!


దెయ్యాలున్నాయా? అంటే హేతువాదులు లేవని అంటారు. మరి కొందరు దేవుడున్నప్పుడు దెయ్యం కూడా ఉంటుందని వాదిస్తారు. ఒకవేళ ఉంటే కనుక పగటిపూట అవి ఎందుకు కనిపించవని మరికొందరు ప్రశ్నిస్తుంటారు. వారి ప్రశ్నలకు అమెరికాలోని రోడే ఐలాండ్ లోని వార్విక్ ప్రాంతంలో సమాధానం దొరికింది. పట్టపగలు దెయ్యాలు ఉయ్యాలూగిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...వార్విక్ ప్రాంతంలోని బీచ్ ఒడ్డున సరదాగా గడుపుదామని ఓ వ్యక్తి కుటుంబంతో చేరుకున్నాడు. బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ లో ఉయ్యాల, జారుడు బల్లను చూసిన మూడేళ్ల అతని కుమార్తె...ఉయ్యాలూగుతానంటూ మారాం చేసింది. దీంతో ఆమెను తీసుకెళ్లేందుకు పాప తండ్రి సిద్ధమవుతుండగా, ఉన్నట్టుండి ఎవరూ తాకకుండానే ఉయ్యాల ఊగడం ప్రారంభించింది. ఆ సమయంలో గాలి కూడా వీయడం లేదు. దీంతో కుమార్తెను నిలువరించిన ఆ వ్యక్తి ఎవరూ లేకుండా వూగుతున్న ఉయ్యాలను వీడియో తీశాడు. అలా చాలసేపు ఉయ్యాల ఊగింది. ఇదేదో దెయ్యం పనేనని సదరు వ్యక్తి బలంగా నమ్ముతున్నాడు. ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా లక్షల మంది వీక్షించారు.

  • Loading...

More Telugu News