: ఉగ్ర లింకులపై అనంతపురంలో ఎన్‌ఐఏ సోదాలు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో పట్టుబడిన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో నిన్న తలాబ్‌కట్టా, బార్కాస్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అనంతపురంలో ఈ రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులు అనంతపురంలోని ఓ లాడ్జిలో బసచేశారన్న సమాచారంతో దానిలో అధికారులు సోదాలు జరిపారు. అక్కడి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో ఓ బస్టాండ్ సమీపంలో పలువురు అనుమానితుల్ని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.