: పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు సక్రమంగా నిర్వర్తించా: వెంకయ్య
భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్యనాయుడు ఈరోజు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తమ పార్టీ అధిష్ఠానం తనకు అదనపు బాధ్యతలు అప్పగించిందని అన్నారు. ‘మనకు ఇచ్చిన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహించాలి. పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు సక్రమంగా నిర్వర్తించా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు పట్టణాభివృద్ధితో పాటు సమాచార, ప్రసార శాఖను సక్రమంగా నిర్వర్తిస్తా’నని ఆయన చెప్పారు. మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రారంభించిందని వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.