: అత్తమామలు, భర్త వేధిస్తున్నారంటూ ఒడిశాకు చెందిన పారిశ్రామికవేత్త కోడలు ఫిర్యాదు


పెళ్లయిన దగ్గర నుంచి తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఒడిశాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా కోడలు లోపాముద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో వివరాల ప్రకారం...పాశ్చాత్య దేశాల కల్చర్ అయిన వైఫ్ స్వైపింగ్ (భార్యల మార్పిడి) కార్యక్రమంలో పాల్గొనడానికి తాను నిరాకరించాననే కారణంతో తన అత్త మామలు, భర్త సవ్యసాచి తనను వేధిస్తున్నారని, 2006లో తమ వివాహం జరిగిందని పేర్కొన్నారు. తన హనీమూన్ సమయంలో కూడా వేరొక వ్యక్తి వద్దకు తనను వెళ్లమని చెప్పడం... అందుకు తాను ఎదురుతిరగడం జరిగిందని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా త్రైలోక్య మిశ్రా దంపతులను, భర్త సవ్యసాచిని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే, మిశ్రా దంపతులు హైకోర్టుకు అప్పీలు చేసుకోవడంతో ఈ నెల 29 వరకు వారిని అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News