: 2008 నుంచి ప్రసారమవుతున్న టీవీ సీరియల్ జూలై 31తో ముగియనుంది!
టీవీ సీరియళ్లంటే ఏళ్లకు ఏళ్లు సాగుతాయన్న పదానికి కీర్తిని తెచ్చిపెట్టిన హిందీ సీరియల్ ఎట్టకేలకు ముగియనుంది. బాల్యవివాహం నేపథ్యంలో 2008లో ప్రారంభమైన 'బాలికా వథు' (చిన్నారి పెళ్లి కూతురు) 2016 జూలై 31న ముగియనుంది. ఈ సీరియల్ లో టైటిల్ రోల్ పోషించిన అవికాగోర్ పెళ్లికి రెడీ అయిపోయింది. మరో నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఈ సీరియల్ మాత్రం నిరాఘాటంగా సాగుతూనే ఉంది. ప్రేక్షకాదరణ కలిగిన ధారావాహికగా గుర్తింపు పొందిన ఈ సీరియల్ కు ముగింపు పలకాలని యూనిట్ భావిస్తోంది. దీంతో కష్టాల కడలిని ఈదుతున్న 'చిన్నారి పెళ్లి కూతురు' కష్టాలు జూలై 31తో తీరిపోనున్నాయి.