: కేన్సర్ రోగుల కోసం జుట్టును త్యాగం చేసిన సినీనటి ఛార్మీ!
కేన్సర్ రోగులకు సాయం చేయమంటే చాలామంది, ఆర్థిక సాయం చేస్తారు.అయితే, అందాల సినీతార ఛార్మి మాత్రం తన జుట్టును త్యాగం చేసింది. తన స్నేహితుడి నివాసం సమీపంలో ఉండే ఇద్దరు యువతులకు కేన్సర్ సోకిందని, వారిద్దరూ తన అభిమానులని చెప్పాడని తెలిపింది. దీంతో వారిని కలిసి, వారితో కొంత సమయం గడిపానని, ఈ సందర్భంగా తన జుట్టు పట్టుకుని, 'అక్కా నీ జుట్టు ఎంత బాగుందో' అని వారిద్దరూ ముచ్చటపడ్డారని తెలిపింది. దీంతో వారికి అంతగా నచ్చిన తన జుట్టుతో విగ్గులు చేయించాలని భావించానని ఛార్మీ చెప్పింది. తన హెయిర్ స్టైలిస్ట్ ను పిలిచి, 18 అంగుళాల జుట్టును కత్తిరించి, వారిద్దరికీ విగ్గులు చేయించానని తెలిపింది. త్వరలో వారిద్దరినీ మళ్లీ కలిసి విగ్గులు అందజేస్తానని తెలిపింది. అవి అందజేస్తుండగా వారి కళ్లలో వెలుగులు చూడాలని ఉందని ఛార్మీ చెప్పింది.