: కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్తత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు మరోసారి ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కార్యకర్తలు ఆరోపించారు. అవినీతిని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ అంశంలో విఫలమయ్యారని వారు అన్నారు. బారికేడ్లను తొలగించి, కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.