: నెల్లూరులో మరోసారి భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
వరుసగా వస్తోన్న భూప్రకంపనలతో నెల్లూరు జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈరోజు జిల్లాలోని వింజమూరు మండలంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. తక్కెళ్లపాడు, జనార్దనాపురం, బత్తినవారిపాలెం, చాకలికొండలో భారీ శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని వరికుంటపాడులోనూ మూడు సెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఏడాది వ్యవధితో మొత్తం 57 సార్లు ఈ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. వరసగా భూ ప్రకంపనలు సంభవిస్తుండడంతో అక్కడి వాసులు భయం గుప్పిట బతుకుతున్నారు.