: ఇద్దరు మహిళా క్రికెటర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు.. బెట్టింగే కారణం
ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై వేటు పడింది. బెట్టింగ్ కు పాల్పడిన తమ దేశ మహిళా క్రికెటర్లు హేలీ జెన్సెన్, కొరిన్నె హల్లపై మొదట రెండేళ్ల నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తర్వాత ఆ నిషేధాన్ని 18 నెలలు తగ్గించింది. దీంతో వారిరువురిపై 6 నెలల చొప్పున నిషేధం కొనసాగనుంది. గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ టీమ్‌ల మధ్య టెస్టు మ్యాచులు జరుగుతోన్న సమయంలో హేలీ జెన్సెన్, కొరిన్నె హల్ల టెస్ట్ మ్యాచ్పై బెట్టింగ్ కట్టారు. ఈ విషయాన్ని జెన్సెన్ ఒప్పుకుంది. అంతేకాక వీరు పురుషుల దేశవాళీ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతోన్న సందర్భంగా కూడా బెట్టింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని హల్ ఒప్పుకుంది. దీంతో ఇక వీరు 6 నెలల నిషేధం ఎదుర్కోనున్నారు.