: ఒవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటున్న కిషన్ రెడ్డి!


భాగ్యనగరి హైదరాబాదులో పెను విధ్వంసానికి ప్లాన్ వేసి పోలీసులకు చిక్కిన ఐదుగురు ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తానని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే ఆయనపై పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఓవైసీపై ఫైరయ్యారు. నేటి ఉదయం హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఓవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ఎంపీగా ఉంటూ ఉగ్రవాదులకు అనుకూలంగా ఎలా ప్రకటనలు చేస్తారని కూదా ఆయన ఓవైసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీ తన ప్రకటనల ద్వారా ఉగ్రవాదులకు మద్దతు పలికారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News