: సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో రోగుల ఆవేదన.. 13 మంది రోగులకు కంటి చూపు పోయే ప్రమాదం
హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు తమ కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసింది. దీంతో రోగులు ఆసుపత్రి వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న 13 మంది రోగులకు చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం తమను కళ్లులేని వారిగా చేస్తోందని రోగులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 30 వ తేదీన 13 మంది రోగులకి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తమకు కంటి ఆపరేషన్ నిర్వహించే ముందు వైద్యులు తమ కళ్లలో ఎక్స్ పైర్ (కాలం తీరిన) ద్రవం వేశారని, దీంతో తమ చూపును కోల్పోయే ప్రమాదం ఉందని రోగులు వాపోతున్నారు.